Top
logo

ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం

ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం
Highlights

శాసనసభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.

శాసనసభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముంతాజ్ అహ్మద్‌ఖాన్ చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. అహ్మద్‌ఖాన్ ఇప్పటికి వరుసగా ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 నుంచి 2014 వరకు యాకుత్‌పురా నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ తాజా ఎన్నికల్లో మాత్రం చార్మినార్‌ నుంచి గెలుపొందారు. కొత్తగా ఏర్పడిన అసెంబ్లీలో ఎవరు ఎక్కువసార్లు, వరుసగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించి ఉంటారో వారికి ప్రొటెం స్పీకర్‌గా అవకాశం లభిస్తుంది. సభా నాయకుడిని మినహాయించి అందరికంటే సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు అసెంబ్లీకి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఈసారి ప్రొటెం స్పీకర్ అవకాశం దక్కింది. ప్రోటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన రేపు ఉదయం 11.30కి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. వెంటనే ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం కేసిఆర్ తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలౌతుంది.

Next Story