Top
logo

నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత
Highlights

నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను...

నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎంపీ కవిత ఎన్నికల అధికారికి సమర్పించారు. ముందుగా ఆమె నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో భర్త అనిల్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను హనుమంతుడి పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు కవిత. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి పార్లమెంట్‌కు వెళ్లడానికి అవకాశం ఇస్తే సేవ చేసేందుకు ముందుంటానని చెప్పారు. దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, ఈ సమయంలో రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకాశం ఉందన్నారు.

Next Story