Top
logo

కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షలు ఆఫర్‌ చేసింది

కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షలు ఆఫర్‌ చేసింది
X
Highlights

గిరిజనుల, ఆదివాసుల సమస్యలు పరిష్కారిస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇవ్వడం వల్లే టీఆర్ఎస్‌లో చేరాలని...

గిరిజనుల, ఆదివాసుల సమస్యలు పరిష్కారిస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇవ్వడం వల్లే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే రేగ కాంతారావు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత తనతో పాటు ఆత్రం సక్కు కూడా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. తామిద్దరం అమ్ముడుపోయామని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ MLCకి ఓటు వేస్తే 50 లక్షల చొప్పున ఆఫర్‌ చేసిందని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రేగా కాంతారావు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

Next Story