ఓటేసిన మంత్రి అల్లోల, పలువురు ఎమ్మెల్యేలు

ఓటేసిన మంత్రి అల్లోల, పలువురు ఎమ్మెల్యేలు
x
Highlights

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో...

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మొత్తం 1850 ఎంపీటీసీ, 179 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కాగా పలు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్‌లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌న స్వ‌గ్రామం ఎల్ల‌ప‌ల్లిలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటును వినియోగించుకున్నారు.

ఇక వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం గోవిందపూర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిని గండ్ర జ్యోతి ఓటేశారు.


















గంగాధర మండలం బూరుగుపల్లి లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.










మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లిలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి దంపతులు ఓటేశారు.










మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద తండాలోఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తన ఓటు వేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories