చంద్రబాబుకి ఆ శిక్ష వేస్తాం:‌ మందకృష్ణ

చంద్రబాబుకి ఆ శిక్ష వేస్తాం:‌ మందకృష్ణ
x
Highlights

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాడు. చంద్రబాబు మాదిగాలను నమ్మించి నట్టేటా...

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాడు. చంద్రబాబు మాదిగాలను నమ్మించి నట్టేటా ముంచడాని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణను తీవ్రంగా ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం మీడియా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ట మాట్లాడుతూ మా మాదిగలకు నమ్మద్రోహం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని మందకృష్ట పేర్కొన్నారు.

ఇక సీట్ల కేటాయింపులో టీడీపీ సర్కార్ కేవలం మాలలకే మాత్రమే పెద్ద పీట వేసిందని, దళితుల విషయంలో చాలా నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబును రానున్న ఎన్నికల్లో గద్దె దించి తగిన బుద్ధి చెపుతామని మందకృష్ట హెచ్చరించారు. ఈనెల 29న తమ రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories