కడుపునిండా కండోమ్‌లే.. అధికారులు షాక్..

కడుపునిండా కండోమ్‌లే.. అధికారులు షాక్..
x
Highlights

దుబాయ్ నుండి ఈజిప్టుకు వెళ్లే విమానం ఎక్కడానికి ఓ యువకుడు వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో పోలీసులు అందరి బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు కస్టమ్స్...

దుబాయ్ నుండి ఈజిప్టుకు వెళ్లే విమానం ఎక్కడానికి ఓ యువకుడు వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో పోలీసులు అందరి బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే ఆ వ్యక్తి కడుపులో ఏదో ఉందని తన కడుపు కొద్దిగా లావుగా అనిపించే సరికి ఆ వ్యక్తిని గట్టిగా మందలించారు. అయినా ఆ వ్యక్తి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇక దీంతో ఆ వ్యక్తి మీద అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతని కడుపులో ఏమున్నాయో డాక్టర్ల పర్యవేక్షణలో పరిక్షించారు. పరీక్షించిన తరువాత పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ వ్యక్తి కడుపునిండా దాదాపు 80 కండోమ్‌లు. ఆ కండోమ్‌ల నిండా కొకైన్ కుక్కిన అతను వాటిని మింగేశాడు. అలా ఆ డ్రగ్స్‌ను ఈజిప్టు తీసుకెళ్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దాంతో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు లక్ష దీనార్లు (సుమారు రూ. ఇరవై లక్షలు) జుర్మానావిధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories