"మరో ప్రణయ్" ...ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువకుడి హత్య

మరో ప్రణయ్ ...ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువకుడి హత్య
x
Highlights

వరుసగా జరుగుతున్న పరువు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి నల్లగొండలో ప్రణయ్, కరీంనగర్‌లో అనూరాధ హత్యోందాలు మరిచిపోకముందే తాజాగా మరో పరువు హత్య చోటుచేసుకుంది. పెళ్లై నాలుగేళ్లు అయినా వాళ్ల పగ చల్లారలేదు.. సమయం కోసం నిరీక్షించారు, కక్ష కట్టారు, కడ తేర్చారు.

వరుసగా జరుగుతున్న పరువు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి నల్లగొండలో ప్రణయ్, కరీంనగర్‌లో అనూరాధ హత్యోందాలు మరిచిపోకముందే తాజాగా మరో పరువు హత్య చోటుచేసుకుంది. పెళ్లై నాలుగేళ్లు అయినా వాళ్ల పగ చల్లారలేదు.. సమయం కోసం నిరీక్షించారు, కక్ష కట్టారు, కడ తేర్చారు. రక్తపుమడుగు నిర్జీవంగా పడిఉన్న ఇతని పేరు నందకిషోర్ హైదరాబాద్ అల్వాల్ వెంకటాపురానికి చెందిన నందకిశోర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు నాలుగేళ్ల క్రితం కిషోర్ పెద్ద కబేలాకు చెందిన అశ్వని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ వేరు వేరు కులానికి చెందిన వారు కావడం వళ్ల నందకిషోర్ ఎస్టీ కులానికి చెందడంతో అశ్వని కుటుంబసభ్యులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నాలుగేళ్ల కిందట నందకిశోర్, అశ్వనిలు పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు.

వీరి ప్రేమకు గుర్తుగా రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతో అశ్వని కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిని విడదీయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. భర్త నంద కిశోర్‌ను వదిలేసి వచ్చేయమని బలవంతం చేశారు. ఈ క్రమంలో అన్యోన్యంగా సాగుతోన్న వీరి కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఇటీవల భర్తతో గొడవపడిన అశ్వని తన కుమారుడ్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నందకిశోర్‌ను మాట్లాడుకుందామని అశ్వని బంధువులు ఇంటికి పిలిపించారు. అతడు అక్కడకు వెళ్లిన తర్వాత ఫుల్లుగా మద్యం తాగించి బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. పెళ్లై నాలుగేళ్లు గడిచిపోయాయి. బాబు పుట్టాడు పగలు చల్లారిపోయాయని నమ్మించి తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని నందకిషోర్ తల్లి వాపోతోంది నందకిషోర్‌ను అతని బావమరిది మహేశ్వర్ హత్య చేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో అశ్విని సోదరుడు మహేశ్వర్‌తో పాటు ఇంకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మొత్తానికి తెలంగాణలో వరుస గా జరుగుతున్న పరువు హత్యలు భయాందోళనకు గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories