డ్రైవర్‌ బీభత్సం.. ప్రాణాలతో చెలగాటం

డ్రైవర్‌ బీభత్సం.. ప్రాణాలతో చెలగాటం
x
Highlights

ఢిల్లీ ఘ‌జియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ రెచ్చిపోయాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో చుక్కలు చూపించాడు. స్పీడ్‌గా వెళ్తూ అడ్డొచ్చిన వాహనాలను ఢీకొడుతూ ముందుకు...

ఢిల్లీ ఘ‌జియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ రెచ్చిపోయాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో చుక్కలు చూపించాడు. స్పీడ్‌గా వెళ్తూ అడ్డొచ్చిన వాహనాలను ఢీకొడుతూ ముందుకు సాగాడు. కారును ఆపేందుకు ఓ యువకుడు ప్రయత్నించినా లెక్కచేయకుండా అదే జోరుతో కారును ముందుకు పోనిచ్చాడు. కారును రఫ్‌గా డ్రైవ్ చేయడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆగ్రహించిన ఓ యువకుడు డ్రైవర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు కారుకు అడ్డంగా నిలబడ్డాడు. కారును ఆపేందుకు నిరాకరించిన యువకుడు స్పీడ్‌గా ముందుకు సాగాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడుకునేందుకు కారు బ్యానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. కారును ఆపకుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు పోనివ్వడంతో పాటు అడ్డుగా ఉన్న యువకుడిని కిందపడేసేందుకు డివైడర్‌ను గుద్దేశాడు. అయినా ఆ యువకుడు బ్యానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అదే రూట్లో వెళ్తున్న కొంతమంది ఒళ్లు గగుర్పొడిచే సీన్‌ను రికార్డ్‌ చేశారు. దీంతో సీన్‌లోకి ఎంటరైన పోలీసులు కారు డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories