రైతుబంధుకు మమత జై

రైతుబంధుకు మమత జై
x
Highlights

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు పలు రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. రైతుల సమస్యల పరిష్కారానికి కీలక అంశాలుగా నిలిచిన తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతుబంధు పథకాన్ని ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రసర్క్‌లు స్వీకరించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు పలు రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. రైతుల సమస్యల పరిష్కారానికి కీలక అంశాలుగా నిలిచిన తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతుబంధు పథకాన్ని ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రసర్క్‌లు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా పశ్చిమబెంగాల్ కూడా ఇదే తరహాలో వెళ్లేందుకు ప్రయత్నింస్తుంది. బెంగాల్ లోని 72లక్షల మంది అన్నదాతలకు లబ్ధికూర్చేలా ప్రతిసంవత్సరం ఎకరానికి రూ. ఐదువేల ఆర్థికసాయం అందించనున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం అధికారికంగా ప్రకటించారు. క్రిషక్ బంధు పేరిట ఈ సాయాన్ని రెండు విడుతల్లో అందిస్తామని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం కానుకగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకరానున్నారు. ఇక మరో వైపు రైతు బీమా పథకం ద్వారా 18నుంచి 60సంవత్సరాల మధ్యగల వయసున్న ప్రతి ఒక్క రైతుకు ఏ కారణంగా మరణించిన వారికి రూ. 2లక్షల చొప్పున నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందిస్తామని సీఎం మమతబెనర్జీ స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories