కాకతీయుల సామ్రాజ్యంలో శివరాత్రి కళ

కాకతీయుల సామ్రాజ్యంలో శివరాత్రి కళ
x
Highlights

ఓరుగల్లులోని శివాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. కాకతీయుల ఆరాధ్య దైవం శివుని ఆలయాలు అనేకం ఓరుగల్లులో నిర్మితమై ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకూ...

ఓరుగల్లులోని శివాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. కాకతీయుల ఆరాధ్య దైవం శివుని ఆలయాలు అనేకం ఓరుగల్లులో నిర్మితమై ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే కళ. శివరాత్రి వచ్చిందంటే చాలు ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి మహాశివున్ని దర్శించుకుంటారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని శివాలయాలు శివరాత్రి శోభపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస జగారాలతో శివుడి స్మరణలో శివభక్తులు తరిస్తుంటారు. దీంతో శివరాత్రి పర్వదినాన శివాలయాలన్ని పండుగ శోభను సంతరించకుంటాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్న వేయి స్థంబాల దేవాలయం, సిద్ధేశ్వరాలయం, కూరవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం, పాలకుర్తి, కాళేశ్వరం, రామప్ప ఇలా జిల్లాలోని శివాలయాలన్ని శివరాత్రి శోభతో మోరుమ్రోగుతున్నాయి. ఇక్కడి దేవాలయాలన్నీ ప్రపంచ పర్యాటకుల మన్ననలు సైతం అందుకున్నాయి. నాటి కాకతీయుల శిలా సంపదను ఒక్కసారి వీక్షిస్తే మళ్లీ మళ్లీ చూడాలనుకునేంతగా ఆకట్టుకుంటాయి. ఇక శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లతో ఆలయాలన్నీ ముస్తాబవుతాయి.

ఇక్కడ మొదటి ప్రతాపరుద్రుడు, రాణీరుద్రమదేవి, రెండ ప్రతాపరుద్రుడు ఇలా వీరి పూజలు అందుకున్న దేవాలయాలు అనేకం. ఈ ఆలయాలన్నీ నేటికీ నిత్య పూజలతో ప్రపంచ పర్యాటకులతో కళకళలాడుతన్నాయి. ముఖ్యంగా హన్మకొండలోని వేయి స్థంబాల దేవాలయం, సిద్ధేశ్వరాలయం, వరంగల్‌ కోటలోని జేలేశ్వరాలయం ఈ మూడు నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. ఇక శివరాత్రికి పండుగ శోభను సంతరించుకుంటాయి. శివరాత్రి సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కూరవి వీరభద్రస్వామి దేవాలయం, రామప్ప దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇలా అన్నీ ఆలయాలలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాలను తిలకిస్తారు.

ఇక గోదావరి నది ఒడ్డున త్రివేణి సంగమ క్షేత్రంలో ఒకే పనుపుపట్టపై ముక్తి, శక్తిఈశ్వరులు కొలువై ఉన్న కాళేశ్వరం దేవస్థానంలో సైతం శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దేవాలయానికి కూత వేటు దూరంలో ఉండటంతో పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివరాత్రి శోభతో కలకలడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories