ఈరోజు (మే-14 - గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

హైదరాబాద్ వాతావరణం : ఈరోజు హైదరబాద్ లో వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్-గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యే అవకాశం ఉంది. సూర్యోదయం 5:44 గంటలకు - సూర్యాస్తమయం సాయంత్రం 6:41 గంటలకు. గాలిలో తేమ శాతం ఈరోజు 51% ఉండొచ్చు. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ చక్కగా ఉండి 25 AQI గా నమోదు కావచ్చు.

విజయవాడ వాతావరణం : ఈరోజు హైదరబాద్ లో వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్-గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యే అవకాశం ఉంది. సూర్యోదయం 5:36 గంటలకు - సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. గాలిలో తేమ శాతం ఈరోజు 82% ఉండొచ్చు. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ చక్కగా ఉండి 23 AQI గా నమోదు కావచ్చు.



Show Full Article

Live Updates

  • 14 May 2020 3:10 AM GMT

    విద్యుత్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కీలక నిర్ణయం!

    జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు అత్యధికంగా వచ్చాయని వినియోగదారులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

    దీనిపై ప్రభుత్వం ఇప్విపటికే విమర్శలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ సమయంలో వేలకు వేలు విద్యుత్తు బిల్లులు రావడంతో ప్రజలలో  ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది..

    ఈ నేపథ్యంలో విద్యుతు బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



     


  • 14 May 2020 2:39 AM GMT

    భువనగిరి జిల్లాకు తిరిగి వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్

    భువనగిరి జిల్లా : మహారాష్ట్రకు వలస వెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లాకు తిరిగి వచ్చిన వారిలో మరో 12 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. వీటిని యాదాద్రి భువనగిరి జిల్లాలో కాకుండా వలస కూలీల జాబితాలో చేర్చారు. ఆత్మకూరు ఎం మండలంలో ఐదుగురు, చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలో నలుగురు, సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు, మోటకొండూరు మండల కేంద్రంలో ఒకరు వ్యాధి బారిన పడ్డారు. ఇందులో ఆత్మకూరు, మోటకొండూరుకు చెందిన వారు మినహా మిగతావారు జిల్లాలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు.మోటకొండూరుకు చెందిన కరోనా బాధితురాలు ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో ఈ నెల 9న రాత్రి నాందేడ్‌ నుంచి వచ్చారు. వారితోపాటు వచ్చిన మరో ముగ్గురిని 10న ఉదయం క్వారంటైన్‌కు తరలించారు. పరీక్షల్లో ఆమెకు మాత్రమే పాజిటివ్‌ రావడంతో నిన్న మరో 13 మందిని బీబీనగర్‌ ఎయిమ్స్‌ క్వారంటైన్‌కు పంపించారు. ఆత్మకూరు మండలానికి సంబంధించి ఇప్పటివరకు 13 మందిని హైదరాబాద్‌కు పంపించగా.. ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వారి కాంటాక్ట్‌లను పరిశీలించి మరో 30 మందిని హోం క్వారంటైన్‌కు ఆదేశించారు..

  • 14 May 2020 2:24 AM GMT

    కొత్తవారు కనిపిస్తే సమాచారం ఇవ్వండి : తెలంగాణా అధికారులు

    తెలంగాణ‌లో పట్టణాలు, గ్రామీ‌ణ ప్రాంతాల్లో కొత్తవారు కనిపించినా, వలస కూలీల జాడ ఉన్నా… ప్రజలు స్థానిక అధికారులకు వెంటనే సమాచారమివ్వాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ కాల్‌సెంటర్‌ 104కు కూడా ఫోన్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వలస జీవుల్లో కరోనా ప్రైమ‌రీ టెస్టులు నిర్వహించడానికి జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 87 చెక్‌పోస్టుల వద్ద 275 మంది హెల్త్ టీమ్స్ నియమించినట్లు పేర్కొన్నారు. ఇలా చెయ్య‌డం ద్వారా రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని..అంద‌రి ఆరోగ్యాల‌కు కూడా మంచిద‌ని సూచించారు..

  • 14 May 2020 1:44 AM GMT

    ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా వైవి.సుబ్బారెడ్డి

    ఢిల్లీలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజిని ఎన్నుకున్నారు. తాడేప‌ల్లిలోని ఛైర్మ‌న్ నివాసం నుంచి బుధ‌వారం ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌మావేశాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు.

    క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హేమ‌ల‌తారెడ్డి మే 31న ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నుండ‌డంతో ఆమె స్థానంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా.ఎం.ప‌ద్మాసురేష్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియ‌మించారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నూత‌న‌ ప్రిన్సిపాల్ నియామ‌కం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా.వెంక‌ట్‌కుమార్‌ను వైస్ ప్రిన్సిపాల్‌గా నియ‌మించారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ళాశాల‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి గ‌వ‌ర్నింగ్‌బాడీ అనుమ‌తి మంజూరు చేసింది.

    ఈ కాన్ఫ‌రెన్స్‌లో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ,టిటిడి బోర్డు స‌భ్యులు, క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌భ్యులు డా. సుధా నారాయ‌ణ‌మూర్తి,  వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, డా. ఎం.నిశ్చిత‌, డిపి.అనంత‌, డా. బి.పార్థ‌సారథిరెడ్డి పాల్గొన్నారు.



     


  • 14 May 2020 1:12 AM GMT

    దిల్లీ నుంచి చేరుకున్న తొలి ప్రత్యేక రైలు

    హైదరాబాద్: దిల్లీ నుంచి ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేకరైలు హైదరాబాద్ చేరుకుంది. అందులో ప్రయాణించిన వారికి అధికారులు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసి పంపించారు. వీరు 14 రోజుల పాటు ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. 



     


  • 14 May 2020 1:07 AM GMT

    తెలంగాణాలో బుధవారం కరోనా పాజిటివ్ కేసులు 41

    తెలంగాణాలో బుధవారం 41 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిదిలోనివే. ఇక కరోనా కారణంగా నిన్న ఇద్దరు చనిపోయారు. మొత్తమ్మీద చనిపోయిన వారి సంఖ్యా 34 కు చేరింది. అదేవిధంగా 117 మంది కరోనా వైరస్ నుంచి చికిత్స పొంది బయటపడ్డ్డారు. ఒక్కరోజులో డిశ్చార్జి అయినవారిలో ఇదే పెద్ద సంఖ్య. మొత్తంగా చూసుకుంటే తెలంగాణాలో కోవిడ్-19 బాదితుల సంఖ్య 1367 గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యా 394 కాగా, ఇంకా చికిత్స 939 మంది చికిత్స పొందుతున్నారు.




Print Article
More On
Next Story
More Stories