యువకుడి చెంప చెళ్లుమనిపించిన కుష్బూ

యువకుడి చెంప చెళ్లుమనిపించిన కుష్బూ
x
Highlights

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. తనతో అభ్యంతకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి చెంప చెళ్లుమనిపించారు. సార్వత్రిక ఎన్నికల...

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. తనతో అభ్యంతకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి చెంప చెళ్లుమనిపించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ ర్యాలీలో రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్- జేడీఎస్ బెంగళూరు సెంట్రల్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తన వాహనం వైపు నడుస్తుండగా ఓ వ్యక్తి వెనక నుంచి ఖుష్బూ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇక దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉగిపోయిన కుష్బూ వెంటనే వెనక్కి తిరిగి చెంప చెళ్లుమనిపించారుచెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనను గమనించిన పోలీసులు, పార్టీ కార్యకర్తలు వెంటనే ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. కాగా దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. మరోవైపు ఈ ఘటనపై రిజ్వాన్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, వెంటనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories