కేటీఆర్‌ను మించిన హిమాన్షు!

కేటీఆర్‌ను మించిన హిమాన్షు!
x
Highlights

పిల్లలు ఎదుగుతుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. నిన్నటి వరకు మన కళ్ళముందు ఆడిపాడిన చిన్నారులు మన కంటే ఎత్తు పెరిగిపోతే ఆ ఆనందం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు...

పిల్లలు ఎదుగుతుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. నిన్నటి వరకు మన కళ్ళముందు ఆడిపాడిన చిన్నారులు మన కంటే ఎత్తు పెరిగిపోతే ఆ ఆనందం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇదే అనుభూతిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పొందుతున్నారు. తన కంటే ఎత్తు ఎదిగిన కుమారుడు హిమాన్షును కేటీఆర్ హత్తుకున్నఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన కుమారుడు హిమాన్షు ఆలింగంనం చేసుకున్న ఫోటోను కేటీఆర్ పోస్ట్ చేసి 13 ఏళ్లకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే గట్టిగా ఓ హగ్‌ను కాకుండా ఇంకా ఏం కోరుకుంటారు అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో కేటీఆర్ తాజాగా పెట్టిన ఫోటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories