Top
logo

ఈ దేశానికి చౌకీదార్‌.. టేకేదార్‌ కాదు..కేసీఆర్‌ కావాలి!

ఈ దేశానికి చౌకీదార్‌.. టేకేదార్‌ కాదు..కేసీఆర్‌ కావాలి!
X
Highlights

వరంగల్‌, ములుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలపై మరోసారి నిప్పులు...

వరంగల్‌, ములుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలపై మరోసారి నిప్పులు చెరిగారు. మాటలతో మాయ చేయడం తప్ప మోడీ చేసిందేమీ లేదన్నారు. మోదీ మై భీ చౌకీదార్‌ అంటున్నాడు. ఒకాయన చౌకీదార్‌ అంటాడు. ఇంకోయన మా ముత్తాత ఈ దేశాన్ని నడిపిండు. మా నాయనమ్మ ఈ దేశాన్ని నడిపింది. కాబట్టి ఈ దేశానికి చౌకీదార్‌, టేకేదార్ అవసరం లేదన్న కేటీఆర్‌ ఈ దేశానికి ఇప్పుడు ఒక జోర్దార్‌, ఒక ధమ్‌దార్‌, ఒక ఇమామ్‌దార్‌ కావాలన్న కేటీఆర్‌ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి ఇప్పుడు కేసీఆర్ కావాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చారు. సిగ్గు లేకుండా మళ్లీ ఇవాళ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కూడా రైతుబంధును కాపీకొట్టారు. ఆంధ్రా రైతులకు నాలుగు పైసలు ఇస్తున్నాడు అంటే అదీ కేసీఆర్‌ పుణ్యమే అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గెలిచేది కచ్చితంగా వైసీపీనేనన్న కేటీఆర్‌, జగన్‌ కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమేనని అన్నారు. మమత, అఖిలేష్‌, నవీన్ పట్నాయక్‌, జగన్‌‌తో కలిసి జాతీయస్థాయిలో పనిచేస్తామన్నారు. ఈ నలుగురి మద్దతుతో ఫెడరల్‌ ఫ్రంట్‌కి 150 స్థానాలు వస్తాయన్న కేటీఆర్‌ ఆ బలంతో కేంద్రాన్ని శాసించే స్థాయికి వెళ్తామని అన్నారు.

Next Story