లక్షల్లో వ్యూస్ కొట్టేసిన పడవ జంట..

లక్షల్లో వ్యూస్ కొట్టేసిన పడవ జంట..
x
Highlights

పెళ్ళికి ముందు జరిగే ఫోటో షూట్ లకు ఈ మధ్య డిమాండ్ పెరిగింది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కాబోయే వధూవరులు ఫోటోలకు పోజులిస్తూ వారెవా అనిపిస్తున్నారు....

పెళ్ళికి ముందు జరిగే ఫోటో షూట్ లకు ఈ మధ్య డిమాండ్ పెరిగింది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కాబోయే వధూవరులు ఫోటోలకు పోజులిస్తూ వారెవా అనిపిస్తున్నారు. ఇలాగే కేరళకు చెందిన వుడ్ బీ వధూ వరుల ప్రీ-వెడ్డింగ్ షూట్ భలే సరదా సన్నివేశాన్ని తలపించింది. అసలు ' స్టోరీ ' లోకి వెళ్తే తిరువల్లూరుకు చెందిన తిజిన్, చంగనచెర్రీ యువతి శిల్పా మే 6 న పెళ్లి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా పంబా నదీ తీరంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ కి ఏర్పాట్లు చేసుకున్నారు.

వీళ్ళు చిన్న పడవ నెక్కి సినిమాలో హీరో, హీరోయిన్లను తలపించే రీతిలో తలలమీద ఓ అరిటాకు పెట్టుకుని ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ముచ్చటలాడుకుంటున్నప్పుడు ఆ పడవ కాస్తా పక్కకు ఒరిగిపోయి ఇద్దరూ నీళ్ళలో పడిపోయారు. అయితే ఇది ప్రమాదం కాదట నీళ్ళలో పడ్డాక ఈజీగానే బయటకు లేచివచ్చారు.

వాళ్ళు అలా నీటిలో పడేలా తమ సహాయకుడు వెనుకనుంచి ఆ పడవను బోల్తా కొట్టించేలా చేశాడని, కానీ తిజిన్, శిల్పాలకు ఈ సంగతి తెలియదని ఈ ఫోటో షూట్ తీసిన వెడ్ ప్లానర్ వెడ్డింగ్ స్టూడియో నిర్వాహకుడు తెలిపాడు. తాము నీళ్ళలో పడిపోతామని ఈ జంటకు తెలియదు. అయితే ఆ తరువాత మేం అసలు విషయం చెప్పేసరికి వాళ్ళు కూడా లైట్ గా తీసుకుని ఎంజాయ్ చేశారు అని ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు. ఏమైనా ఈ హిలేరియస్ వీడియో నెట్టింట్లో హల్‌చల్ల చేస్తోంది. రెండు లక్షల వ్యూస్ కొట్టేసింది.





Show Full Article
Print Article
Next Story
More Stories