Top
logo

కాంగ్రెస్‌, బీజేపీ రహిత కూటమి రావాలి

కాంగ్రెస్‌, బీజేపీ రహిత కూటమి రావాలి
X
Highlights

ప్రధాని నరేంద్రమోడీ చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని చేసిన ఒక్కో విమర్శను ప్రస్తావిస్తూ...

ప్రధాని నరేంద్రమోడీ చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని చేసిన ఒక్కో విమర్శను ప్రస్తావిస్తూ ఓరుగల్లు బహిరంగ సభలో చెలరేగిపోయారు. ప్రధానిగా ఉంటూ ఇంతలా దిగజారి మాట్లాడతారా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు వేల కోట్లు ఇచ్చామంటున్న మోడీ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల గురించి చెప్పరా ? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ రహిత పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీ మనల్ని సాదడం లేదు. మనమే ఢిల్లీని సాదుతున్నట్లు తెలిపారు. చిన్న చిన్న సమస్యలు కూడా కేంద్రం దగ్గరే ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని కూటమి కేంద్రంలో రావాలన్నారు. మంత్రి దయాకర్‌రావు, వరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

Next Story