Top
logo

దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు- ఎస్పీ రాహుల్‌దేవ్‌

దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు- ఎస్పీ రాహుల్‌దేవ్‌
Highlights

వివేకానందరెడ్డి హత్య కేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ లో.. వైఎస్ వివేకాది...

వివేకానందరెడ్డి హత్య కేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ లో.. వైఎస్ వివేకాది హత్యేనని తేలడంతో, హత్య చేసింది ఎవరు..? హత్యకు గల కారణాలేమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది. వైఎస్ వివేకా శరీరంపై మొత్తం 7 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బెడ్రూమ్ లో చంపి అనంతరం, బాత్రూమ్ లో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి బ్యాక్ డోర్ తెరిచి ఉండటంతో పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వివేకా మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దోషుల్ని వెంటనే అరెస్ట్ చేసి, నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని సీఎం సూచించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి కేసులో స్పీడు పెంచిన పోలీసులు ఈ కేసుపై సిట్‌ ను ఏర్పాటు చేశారు. సీఐడీ అడిషనల్ డీజీపీ అమిత్ గార్గ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది డీజీపీ కార్యాలయం. వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని చెప్పారు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌. సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని తెలిపారు. ఘటనాస్థలాన్ని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించాయని వివేకానంద గదిలో వేలిముద్రలు, ఫుట్ ప్రింట్స్ గుర్తించామని చెప్పారు. పులివెందుల్లోని వైఎస్ వివేకానంద నివాసంలో డాగ్ స్క్వాడ్ లతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే డాగ్ స్క్వాడ్ వివేకానంద ఇంటి చుట్టూనే తిరిగింది. దాంతో రాత్రి పదకొండున్నర నుంచి ఉదయం ఆరు గంటల్లోపు ఇంట్లో అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూమ్ లో డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉంది? సైడ్ డోర్ లాక్ ఎవరు తీశారు? అనే కోణాల్లో విచారపు జరుపుతున్నారు.

Next Story