అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుస్తారు: కేఏ పాల్

అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుస్తారు: కేఏ పాల్
x
Highlights

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాగా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఏపీలో 76.69 శాతం పైగా ఓటింగ్...

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాగా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఏపీలో 76.69 శాతం పైగా ఓటింగ్ నమోదయ్యింది. ఇది ఇలా ఉండగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. తన వినూత్న ప్రచారంతో పలువురిని ఆకట్టుకున్నారు.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు కేఏ పాల్. నిన్నటివరకు నరసాపురంలో ప్రజాశాంతి పార్టీదే గెలుపని చెప్పిన పాల్ తాజాగా ప్లెట్ మార్చేశారు. నరసాపురంలో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నారు. అయితే నరసాపురం లోక్‌సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ ఈవీఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేఏ పాల్ జోస్యం చెప్పారు. అయితే అసలు ఎన్నికల కమిషన్ భారత ప్రధాని నరేంద్రమోడీ చేతులో కీలుబోమ్మలా మారిందని మండిపడ్డారు. అవినీతిపై యుద్ధానికి పెద్ద ఎత్తున యువత తనతో రావాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories