జన్మభూమి ప్రతిజ్ఞా... అయితే ఏంటి..?

జన్మభూమి ప్రతిజ్ఞా... అయితే ఏంటి..?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'జన్మభూమి" ఈ కార్యక్రమానికి సంబందించి ఏపీ సర్కార్ పక్కాగా దిశానిర్ధేశం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'జన్మభూమి" ఈ కార్యక్రమానికి సంబందించి ఏపీ సర్కార్ పక్కాగా దిశానిర్ధేశం చేసింది. కాగా ప్రతిరోజు ఈ జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యంగా రోజువారిగా క్రమం తప్పకుండా జన్మభూమి కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ చేసేటప్పుడు తప్పకుండా అందరూ లేచి నిలబడి చేయి ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిజ్ఞలో అధికారులతో పాటు పెద్దలు,చిన్నలు అందరూ కలిసి నిట్టనిలువుగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు. అయితే అదే అధికారులతో పాటు ఉన్న హోమియో వైద్యురాలు మాత్రం తాను ఎందుకు నిలబడలే అనుకుందో ఎమోగాని తనకు ఎం సంబంధం లేనట్టే తన కూర్చిలోనే ముద్డుగా కూర్చుంది. మొత్తానికి ఇంగ్లీష్‌లో చెప్పలాంటే ఐ డోండ్ కేర్ అన్నట్లుగా ముద్దుగా సెల్ ఫోన్ ఆడుకుంటూ కూర్చుంది. ఆమే పక్కన్న ఉన్న అధికారలకు ఆమెకు చెప్పే ధైర్యంలేక చప్పడుచేయకుండా ఉండిపోయారు. ఈ ముచ్చట గుంటూరు జిల్లా పత్తిపాడు మండల పరిధిలోని కొండేపాడులో జరిగింది. వైధ్యాధికారి హసీనా ఈ విధంగా చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమే నిర్లక్ష్యం పట్ల ఎంపీడీవో పావులూరి బాలమ్మ, మండల ప్రత్యేకాధికారి రమేశ్ లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories