అభ్య‌ర్ధుల క‌స‌ర‌త్తు, ప్ర‌చారంపై ప‌వ‌న్ ఫోకస్..

అభ్య‌ర్ధుల క‌స‌ర‌త్తు, ప్ర‌చారంపై ప‌వ‌న్ ఫోకస్..
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాపోరాట యాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభ‌మైన యాత్ర గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో ముగిసింది. దీంతో ఇక...

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాపోరాట యాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభ‌మైన యాత్ర గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో ముగిసింది. దీంతో ఇక అభ్య‌ర్ధుల క‌స‌ర‌త్తు, ఎన్నిక‌ల ప్రచారంపై పోక‌స్ పెట్టారు ప‌వ‌న్. ఇందుకోసం ఈ నెల 14 పార్టీ అవిర్బావం నుండి ఎన్నిక‌ల శంఖారావం ప్రారంభించున్నారు. ‌ఏపీలో ఎన్నికల హీట్ మొదలయ్యింది. రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేస్తూ ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఈ నేప‌ద్యంలో ఈ సారి కొత్తగా బ‌రిలోకి దూకుతున్న జ‌న‌సేన ఎన్నిక‌లకు రెడీ అవుతోంది. ప్ర‌జా పోరాల యాత్ర పేరుతో ప‌వ‌న్ గ‌త ఏడాది మే నెల‌లో చేప‌ట్టిన యాత్ర ముగియ‌డంతో ఇక ఎన్నిక‌ల‌పై పోక‌స్ పెట్టారు ప‌వ‌న్.

ప్ర‌జా పోరాట యాత్ర పేరుతో అన్ని జిల్లాలు క‌వ‌ర్ చేశారు ప‌వ‌న్. ఇప్ప‌టి వ‌రకూ 120 నియోజ‌క‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడ‌ర్‌కే ప‌వ‌న్ పోరాట యాత్ర ఉత్సాహాన్ని పెంచింది. పోరాట యాత్ర‌లో బాగంగా స్థానిక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించిన ప‌వ‌న్ కొన్ని కీల‌క స‌మ‌స్య‌ల‌పై క‌వాతులు నిర్వ‌హించారు. జ‌గ‌న‌సేన క‌వాతుల‌కు యువ‌త నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది.ప్ర‌జా పోరాట యాత్ర ముగియ‌డంతో ఇక అభ్యర్ధుల క‌స‌ర‌త్తు, ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఫొకస్ పెట్టారు ప‌వ‌న్. వ‌చ్చే వారంలో ఎన్నిక‌ల నోటిపికేష‌న్ వ‌స్తుంద‌నే సమాచారం నేప‌ద్యంలో నోటిపికేష్ వ‌చ్చిన వెంట‌నే ఎన్నిక‌ల శంఖారావం ప్రారంభించేందుకు సిద్దమ‌వుతున్నారు.

ఇందుకోసం మార్చి 14 తేది పార్టీ అవిర్బావం రోజు శ్రీకారం చుట్ట‌బోతున్నారు ప‌వ‌న్. గ‌త ఆవిర్బావ దినోత్స‌వం నుండే ప‌వ‌న్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వ‌చ్చారు. ఏడాదిగా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ పార్టీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసే ప్ర‌య‌త్రం చేశారు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేపద్యంలో మార్చి 14 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల‌నుండి పార్టీ కార్య‌క‌ర్త‌లతో భారీ బహిరంగ స‌భ నిర్వ‌హించి ఎన్నిక‌ల శంఖారావం పూరించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు. ఇందుకోసం పార్టీ క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట యాత్ర చేసిన ప‌వ‌న్.. మార్చి 14 నుండి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రాంభించ‌నుండడంతో పార్టీక్యాడర్ మరింత ఉత్సాహంతో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories