వైఎస్ జగన్ ఫుల్ ఖుషీ.. ఎందుకో తెలుసా..

వైఎస్ జగన్ ఫుల్ ఖుషీ.. ఎందుకో తెలుసా..
x
Highlights

ఇటివల వెలువడిన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించనివిధంగా సంచలన విజయం సాధించింది. అసెంబ్లీ,...

ఇటివల వెలువడిన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించనివిధంగా సంచలన విజయం సాధించింది. అసెంబ్లీ, లోక్‌సభ రెండింటిలోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపుఅన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇందుకోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల దూరం కాళ్లరిగేలా తిరిగితే దక్కిన పీఠం. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అందివచ్చిన ముఖ్యమంత్రి పదవి. మరో రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు.

ఇక ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద కోలహాలం నెలకొంది. అధికారుల దగ్గరి నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇవన్నీ కామనే. కానీ, జగన్ సంబరపడిపోయే సంఘటన తాజాగా చోటుచేసుకుంది. తొలిసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తెలు వర్షారెడ్డి, హర్షారెడ్డి తాడేపల్లిలోకి చేరుకొని తండ్రి జగన్‌కి కుమార్తెలు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో జగన్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories