ఇంటర్ మార్కుల్లో అక్రమాలు... బోర్డు ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

ఇంటర్ మార్కుల్లో అక్రమాలు... బోర్డు ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా
x
Highlights

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు...

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్లే విద్యార్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్దకం చేసారంటూ ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

పరీక్షల్లో ఎప్పుడూ మంచి స్కోర్ సాధించే తమకు అతి తక్కువ మార్కులు రావడంతో పలువురు విద్యార్ధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విద్యార్ధులకు వారి తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. బోర్డు తీరుపై మండిపడుతున్నారు. కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఫలితాల్లో గందరగోళానికి కారణమైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరారు.

అన్ని సబ్జెక్టుల్లో 90 శాతానికి పైగా మార్కులు వచ్చినా గణితం పేపర్ 2బీలో సింగిల్ డిజిల్ మార్కులు వేశారని ఓ విద్యార్ధిని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఇంటర్‌ బోర్డ్ కార్యదర్శి అశోక్ స్పందించారు. అన్యాయం జరిగిందని భావించిన వారికి రీకౌంటింగ్‌కు ఛాన్స్‌ కల్పిస్తామని..ఆన్సర్‌ షీట్‌లను కూడా చూపిస్తామని హామీ ఇచ్చారు. బోర్డు అధికారుల నుంచి సరైన హామీ లభించకపోవడంతో విద్యార్ధులు, వారు తల్లిదండ్రులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories