కౌన్ బ‌నేగా ఏపీ సీఎం ? పెరిగిన పోలింగ్.. గెలుపుపై ఇరు పార్టీలూ ధీమా!

కౌన్ బ‌నేగా ఏపీ సీఎం ?  పెరిగిన పోలింగ్.. గెలుపుపై ఇరు పార్టీలూ ధీమా!
x
Highlights

ఏపీ చరిత్రలోనే పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పోలింగ్ ప్రారంభం నుంచి ఈవీఎంలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల...

ఏపీ చరిత్రలోనే పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పోలింగ్ ప్రారంభం నుంచి ఈవీఎంలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ నిర్వహించారు. దీంతో 76.69 శాతం పైగా ఓటింగ్ నమోదయ్యింది. కాగా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కొంతమేర పోలింగ్‌ శాతం తగ్గిందని తెలిపారు. ఘర్షణలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇది ఇలా ఉంటే ఏపీలో పెరిగిన ఓటింగ్ శాతంతో తమకే అనుకూలమని టీడీపీ, ఇటు వైసీపీ ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. అయితే గత ఐదేండ్లలో టీడీపీ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలపై ఏపీ ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని అందువల్లే తాము మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు టీడీపీ అంటోంది. కాగా తెలుగుదేశం ప్రభుత్వ పథకాలలో పసుపు కుంకుమ వల్ల మహిళలు, ఇక పింఛన్‌‌తో వృద్ధులు, అన్నదాత సుఖీభవతో రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారని టీడీపీ అంటున్నారు. అయితే పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యం చెందినా ప్రజలు ఓపికగా నిలబడి ఓటేయడం తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. కాగా ఈవీఎంలు మొరాయింపుతో ఏపీలోని ఓటర్లు తీవ్ర ఇబ్బందిపడి కూడా ప్రజలు ఉదయం పది గంటల వరకు కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో సాంకేతి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఓటర్లు గంటల కొద్దీ క్యూ లైన్ లోనే నిలబడి ప్రజలు ఓపికగా నిలబడి ఓటేయడం తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. కాగా ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఇక గత ఐదేళ్ల పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు ఇప్పుడు నమోదైన పోలింగ్‌ శాతమే నిదర్శనమని వైకాపా భావిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇది ప్రజల విజయమని వైఎస్‌ జగన్‌ అన్నారు. నారా చంద్రబాబు చేసిన కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు అన్నింటిని దాటుకున్ని ఓటు వేసారిని ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించబోతోందనే గట్టి ధీమా వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తాము ఘన విజయం సాధించబోతున్నామని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేయగా పార్టీ నేతలు సైతం అదే ధీమాతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే తమకు పూర్తి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయనే అంచనాతో వారున్నారు. చివరకు పోలింగ్‌ 80 శాతానికి చేరడం ఖచ్చితంగా తమకు లాభించే అంశమేనని ధీమాగా ఉంది. పాదయాత్రతో ప్రజలకు జగన్ చేరువ కావడం, ప్రత్యేకహోదా విషయంపై మొదటి నుంచీ ఒకే మాటపై ఉన్నారని వాదిస్తోంది. ఇక చూడాలి మరీ పెరిగిన పోలింగ్ శాతంతో ఎవకి లాభం చేకుర్చుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories