Top
logo

తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
Highlights

రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్‌,23 మంది ఐపీఎస్ అధికారులు పదోన్నతులు పొందారు. ఈసీ అనుమతితో 49 మంది ఆల్‌ ఇండియా...

రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్‌,23 మంది ఐపీఎస్ అధికారులు పదోన్నతులు పొందారు. ఈసీ అనుమతితో 49 మంది ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. వీరిలో ఐదుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి లభించింది. మరో నలుగురు ఐపీఎస్‌లకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఏడుగురు ఐపీఎస్‌లకు డీఐజీలుగా పదోన్నతి లభించగా మరో ఆరుగురు ఐపీఎస్‌లకు సీనియర్ స్కేల్‌ అధికారులుగా పదోన్నతి లభించింది. కేంద్ర సర్వీసులో ఉన్న మరొక అధికారికి ఐజీగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story


లైవ్ టీవి