'కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా.. ఏపీలో నేనే సీఎం..'

కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా.. ఏపీలో నేనే సీఎం..
x
Highlights

ఎప్పటికప్పడు వివాదస్పద వ్యాఖ్యాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ . అయితే తాజాగా మరోసారి తనదైశ శైలీలో రెచ్చిపోయారు కేఏ పాల్.

ఎప్పటికప్పడు వివాదస్పద వ్యాఖ్యాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ . అయితే తాజాగా మరోసారి తనదైశ శైలీలో రెచ్చిపోయారు కేఏ పాల్. రానున్న ఎన్నికల నేపథ్యంలో మరింత జోరు పెంచుతున్నారు కేఏ పాల్. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిని అవుతానని, తాను ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణమే నారా చంద్రబాబు నాయుడుని సలహాదారుగా పెట్టుకుంటానని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తాజాగా సర్వేలన్నీ తనకు అనుకులంగా ఉన్నాయని ఈ నేపథ్యంలో తాను సీఎం కూర్చి ఎక్కకూడదని సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గుంటురులో కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం కాలేడని, ఇకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభావం అంతాగా ఉండదని అన్నారు. మోడీ, చంద్రబాబు శ్వాశత మిత్రులేనని అన్నారు. వారికి తోడు వైయస్ జగన్ కూడా కలిసిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో కలిసి పనిచేస్తాను అని అన్నారు. ఇక దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ 18పార్టీలతో కూడిన థర్డ్ ఫ్రంట్ కు 300కు పైగానే సీట్లు వస్తాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories