Top
logo

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేడి..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేడి..
X
Highlights

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేడి రగిలింది. నోటిఫికేషన్ వచ్చే లోపే నియోజకవర్గాల్లో ఒక విడత పర్యటించాలని...

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేడి రగిలింది. నోటిఫికేషన్ వచ్చే లోపే నియోజకవర్గాల్లో ఒక విడత పర్యటించాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేయగా బీజేపీ కూడా గౌరవప్రదమైన స్ధానాలు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

శాసననసభ ఎన్నికలను పునారావృతం చేయడం ద్వారా ఢిల్లీ వరకు కారు జోరును కొనసాగించాలని భావిస్తున్న టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం పార్లమెంట్ స్ధానాల వారిగా సన్నాహక సమావేశాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టారు. పార్టీకి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచే సన్నాహక సమావేశాలను ఆయన ప్రారంభించనున్నారు. పార్లమెంట్ స్ధానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, దిత్వియ శ్రేణి నాయకులు, స్ధానిక సంస్ధల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కేటీఆర్ ఈ సందర్భంగా వివరించనున్నారు. టీఆర్ఎస్ సత్తాను ఢిల్లీ వరకు చాటాలంటే ప్రతి ఓటు కీలకమని దిశానిర్దేశం చేయనున్నారు. బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాను సరిచూసుకుని .. ప్రతి ఒక్కరితో ఓటు వేయించేలా కార్యాచరణ ప్రకటించున్నారు .

కేటీఆర్‌ కరీంనగర్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. కరీంనగర్‌ను గులాబిమయంగా మార్చారు. సుమారు 20 వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావచ్చని భావిస్తున్న నేతలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాటం చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అధినేత రాహుల్ గాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈ నెల 9న ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిధ్దమయ్యారు. ఇప్పటికే పర్యటన ఖారారయిన నేపధ్యంలో చేవెళ్ల పరిధిలోని పహాడి షరీఫ్‌లో భారీ బహిరంగకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే వేదికగా కనీస ఆదాయం పథకాన్ని రాహుల్ ప్రకటించే అవకాశాలున్నట్ట సమాచారం. గతంలో 2004,2009లో చేవెళ్ల నుంచి ప్రచారం ప్రారంభించిన అప్పటి సీఎం వైఎస్ఆర్ రెండు సార్లు పార్టీని అధికారంలో తేవడంతో పాటు కేంద్రం యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు పెద్ద సంఖ్యలో ఎంపీలను అందించారు. దీంతో మరోసారి తమ సెంటిమెంట్ పండుతుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

టీఆర్ఎస్‌, కాంగ్రెస్ హోరాహోరిగా ప్రచారానికి సిద్ధమైన సమయంలోనే బీజేపీ కూడా సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆ పార్టీ బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ దీని ద్వారా నిత్య పర్యవేక్షణ చేస్తూ కార్యకర్తలు, నేతలకు ఎప్పటికప్పడు దిశానిర్దేశం చేయనుంది. అమిత్ ‌షా పర్యటన సందర్భంగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, కరీంనగర్ నియోజకవర్గాలో నేతలతో అమిత్‌షా సమావేశం నిర్వహించున్నారు .గడచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను వివరిస్తూ గ్రామ స్ధాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఇందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలను సిద్దం చేయనుంది. పుల్వామా దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో అమిత్ షా పర్యటన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

Next Story