Top
logo

జనసేనకు అన్ని సీట్లు రావాలని కోరుకుంటున్నా.. హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు

జనసేనకు అన్ని సీట్లు రావాలని కోరుకుంటున్నా.. హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
Highlights

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస హీట్లతో మంచీ జోరు మీద ఉన్న హీరో నిఖిల్. ప్రస్తుతం అర్జున్ సురవరం చిత్రంతో...

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస హీట్లతో మంచీ జోరు మీద ఉన్న హీరో నిఖిల్. ప్రస్తుతం అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే అప్పుడప్పడు సోషల్ మీడియాలో కూడా తనదైన శైలీలో ట్వీట్లతో తన ఫ్యాన్‌తో సరదగా ఉంటాడు. అయితే తాజాగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే చూడాలని ఉందని అన్నారు. పవన్ సినిమా ఎప్పుడు రిలీజైనా కనీసం తక్కువలో తక్కువగా 100 రోజులు ఆడుతుందని, అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన సైతం 100 సీట్లు సాధించాలని కోరుకుంటున్నట్లు నిఖిల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలపై అంతా చాలా టెన్షన్‌గా ఉన్నారని, దాంతో పోలిస్తే తన సినిమా టెన్షన్ చాలా తక్కువని నిఖిల్ అన్నారు.


లైవ్ టీవి


Share it
Top