కోడి పందెలకు సిద్ధం అవుతున్న గోదావరి జిల్లాలు

కోడి పందెలకు సిద్ధం అవుతున్న గోదావరి జిల్లాలు
x
Highlights

కాలికి కత్తి, పందెంలో రౌద్రం, బరిలో విజయమో, వీర స్వర్గమో అన్నట్టు తలపడే పుంజుల కేకలతో గోదావి మారుమోగుతోంది. గోదారి నీళ్లు తాగిన పౌరుషం చూపించేందుకు కోళ్లు పోటీపడుతున్నాయి

కాలికి కత్తి, పందెంలో రౌద్రం, బరిలో విజయమో, వీర స్వర్గమో అన్నట్టు తలపడే పుంజుల కేకలతో గోదావి మారుమోగుతోంది. గోదారి నీళ్లు తాగిన పౌరుషం చూపించేందుకు కోళ్లు పోటీపడుతున్నాయి. తన యజమాని ఆనందంకోసం తాను బలైపోయేందుకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. కాళ్ళకు ఇంకా కత్తులు కట్టకుండానే బలిసిన కోడి పుంజులు కొట్లాటకు దిగుతున్నాయి. జీడిపప్పు, పిస్తా మేస్తూ ఎక్సర్ సైజ్‌లు చేస్తూ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పందెం రాయుళ్ళు ఎవరి సన్నాహల్లో వారు సిధ్ధమవుతున్నారు. కోడి పందెలతో సంకాంత్రిలో మరింత జోష్ నింపనున్నారు.

గోదావరిజిల్లాలో ప్రస్తుతం వినిపిస్తున్న మాటలు ఇవే. సంక్రాంతి కోడి పందాలకు గోదావరి జిల్లాల్లో కోళ్లను సిద్ధం చేస్తున్నారు. మూడు నెలల ముందుగానే పందాలకు కోళ్లను రెడీ చేశారు. పందెం కోళ్ల ఆహారం, ఎక్సర్ సైజ్‌లు విషయంలో ఎన్నోజాగ్రత్తలు తీసుకుంటున్నారు పెంపకం దారులు. ఇక ఇలా తయారు చేసిన పందెం కోళ్లు 5వేల నుంచి 50వేల వరకూ పలుకుతుంటుంది. కాకి, డేగ, నెమలి, సవల అంటూ రకరకాల జాతుల కోళ్లు పందెలకు సిద్ధం అవుతున్నాయి.

ఇక కోళ్ల పందాలు ఏదో మామూలుగా ఆడేస్తారు అనుకుంటే పొరపాటే కోళ్లను భరిలోకి దింపే ముందు కుక్కుటపురాణాన్ని పఠనం చేస్తూ. ముహుర్తాలు కూడా నిర్ణయం చేసి పోటికి పంపుతారు. కోళ్ళను పెంచడం భరిలోకి దించేవారికన్నా. పోటిని ఆశ్వాదించేవారు, పందాలు కాసే వారే భారీగా ఉంటారు. ఆక్షణంలో లక్షలను కూడా చిత్తు కాగితాలులా విసిరేస్తారు. అంత పిచ్చ ఆపందాలంటే. అందుకే కోడి పందాలు ఉండాలంటూ. ప్రజాప్రతినిధుల పై ఒత్తిళ్ళు ఉంటాయి. అంతెందుకు సాక్షాత్తు ఆనాయకులే దగ్గరుండి పోటిలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే పలువురు నేతలు తమ అనుచరులకు కోడిపందాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని హామీలిచ్చేసినట్లు సమాచారం.

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలంగాణలో స్ధిరపడ్డ వారు కూడా గోదావరి జిల్లాలకు తరలి వస్తుంటారు. సంక్రాంతికి ఎన్ని పనులు ఉన్నా వాటిని కాన్సిల్ చేసుకొని సరదాగా మూడు రోజులు గడిపి పోదామనే ఆలోచనలో ఉంటారు. ఇక వస్తూ వస్తూ తమ స్నేహితులను సైతం గోదావరి జిల్లాలకు తీసుకు వచ్చి. కోడి పండాలు ఆడిస్తారు. గెలిస్తే ఆనందం, ఓడితే సరదా అనట్లు లైట్ తీసుకుంటారు. ఇక పదాలు నిర్వహించేందుకు భారీ సరంజామాను కూడా సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories