రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ద్వివేది

రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ద్వివేది
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల ఈ నెల 6న మూడు జిల్లాలోని 5 పోలింగ్ కేంద్రాలపరిధిలో రిపోలింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు....

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల ఈ నెల 6న మూడు జిల్లాలోని 5 పోలింగ్ కేంద్రాలపరిధిలో రిపోలింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. శనివారం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ సూపరిన్టెండెంట్ పోలీస్ అధికారి, ప్రత్యేక కేంద్ర పరిశీలికుల ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా రిపోలింగ్ ఎన్నికలను నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నర్సరావుపేట, గుంటూరు వెస్ట్‌, నెల్లూరు సిటీ, సుళ్లురు పేట, ఎర్రగొండపాలెంలోని ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ ఉంటుందని చెప్పారు. రీపోలింగ్ బూత్‌లను సైతం సమస్యాత్మకంగానే పరిగణిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. కాగా అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌‌లు సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories