Top
logo

బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్..

బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్..
Highlights

ఢిల్లీ ఆటగాడు, మాజీ క్రికటర్ గౌతం గంభీర్ బీజేపీలో చేరారు. ఈరోజు ఢిల్లీలోని బీజేపీ పార్టీలో అరుణ్ జైట్లీ...

ఢిల్లీ ఆటగాడు, మాజీ క్రికటర్ గౌతం గంభీర్ బీజేపీలో చేరారు. ఈరోజు ఢిల్లీలోని బీజేపీ పార్టీలో అరుణ్ జైట్లీ సమక్షంలో గౌతం గంభీర్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గౌతం లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 37 సంవత్సరాల గౌతం గంభీర్ టీమిండియాలో 2003లో టీమిండియాలో చోటు సంపాదించాడు. అనంతరం అద్భుతమైన ఆటతీరుతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గౌతం కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే గౌతం గంభీర్. రాజకీయ, సామాజిక అంశాలపై చురుగ్గా స్పందిస్తుంటారు. పలు సేవా కార్యక్రమాల్లో కూడా గౌతం గంభీర్ పాల్గొంటూ అందిరి అభినందనూ అందుకున్నాడు.

Next Story

లైవ్ టీవి


Share it