లోకేష్ భర్త చంద్రబాబు.. నామినేషన్‌లో తప్పిదం

లోకేష్ భర్త చంద్రబాబు.. నామినేషన్‌లో తప్పిదం
x
Highlights

భర్త పేరు ఉండాల్సిన చోట తండ్రి పేరు ఆస్తులు రాయలేదు, అప్పులు చెప్పలేదు ఫోటో కూడా అధికారులు చెప్పే వరకూ అంటించలేదు.. వివరాలు అందించాల్సిన చోట ఖాళీ...

భర్త పేరు ఉండాల్సిన చోట తండ్రి పేరు ఆస్తులు రాయలేదు, అప్పులు చెప్పలేదు ఫోటో కూడా అధికారులు చెప్పే వరకూ అంటించలేదు.. వివరాలు అందించాల్సిన చోట ఖాళీ పేపర్లు పెట్టారు. ఎన్నికల అధికారులకు నేతలు సమర్పించే నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లడం విమర్శలకు పాలవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.

ఏపీ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి వేడెక్కుతోంది. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఈ నెల 22న మంచి ముహూర్తమని ఎక్కువ మంది రాజకీయ నాయకులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అయితే ఇందులో పలువురి నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లడంతో ఆయా నేతలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

సీఎం చంద్రబాబు ఆయన సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం అసెంబ్లీ సీటుకి నామినేషన్ వేయగా లోకేష్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి స్థానానికి పత్రాలు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి నామినేషన్ పత్రాలలోని ఒక అనుబంధ పత్రంలో ఖర్జూర నాయుడుని చంద్రబాబు తండ్రికి బదులు భర్తగా పేర్కొన్నారు. అదే తప్పు లోకేష్ పత్రాలలోనూ చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ఆయన భర్తగా రాశారు.

ఓటర్ల జాబితాలో అభ్యర్థి ఎక్కడైతే ఓటర్ గా నమోదయ్యాడో ఆ ఓటర్ జాబితాలోని పత్రాన్ని నామినేషన్ కి అనుబంధంగా సమర్పించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే పత్రంలోనే దారుణమైన పొరపాటు చోటు చేసుకుంది. నిజానికి ఈ పత్రం సంబంధిత ఎన్నికల నమోదు అధికారి జారీ చేశారు. అతనే పొరపాటు చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇంత పెద్ద తప్పుని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఇదే కాపీని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల అఫిడవిట్ లకు జత పరిచారు.

ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కిలారి ఆనంద్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ వేశారు. నామినేషన్ లో పాల్ చాలా బాగం ఖాళీగా వదిలేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ పేపర్లపై అధికారులు చెప్పే వరకు ఫోటో కూడా అంటించలేదట. దీంతో అవాక్ అయిన అధికారులు నామినేషన్‌కు అవసరమైన పత్రాలను సోమవారం అందించాలని ఆయనకు సూచించారు. మొత్తానికి ప్రముఖ పార్టీల నేతలు నామినేషన్ పత్రాల్లో ఇలాంటి తప్పులు దొర్లడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories