14 నెలల బాలుడు.. 4వ అంతస్తు నుంచి కింద పడి..

baby
x
baby
Highlights

14నెలల చిన్న బాలుడు చావును సైతం ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచాడు. ముంబయిలో 14నెలల నిండిన బాలుడు తమ ఇంటి నాలుగో అంతస్తు నుండి కిందపడి తిరిగి ప్రాణాలతో నిలిచాడు.

14నెలల చిన్న బాలుడు చావును సైతం ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచాడు. ముంబయిలో 14నెలల నిండిన బాలుడు తమ ఇంటి నాలుగో అంతస్తు నుండి కిందపడి తిరిగి ప్రాణాలతో నిలిచాడు. ముంబయిలోని గోవండిలోని ఓ అపార్టుమెంట్లో ఈ ఘటన చోటుచేకుంది. ఇక వివరాల్లోకి వెళితే తమ ప్లాట్‌లో బాల్కనీకి గ్రిల్స్ పెట్టకపోవడంతో అక్కడి నుండి బాలుడు కింద పడ్డాడని తలిదండ్రులు వెల్లడించారు. అయితే వారి బాల్కనీ కిందనే చెట్టు ఉండడంతో బాలుడు అక్కడి నుండి కిందపడి భూమికి తాకాడు. అయితే తల్లి బాల్కనీలోని వెళ్లే తలుపు తెరిచి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని తలిదండ్రులు తెలిపారు. అయితే బాలుడు తమ ముందే ఆడుకుండు ఉన్నాడని ఉన్నట్టుండి బాలుడు కనిపించపోవడంతో తల్లి బల్కనీ వైపు వచ్చి వెతుకుతుండగా బల్కనీ కింద ఉన్న చెట్టు నుండి బాలుడు కిందకు పడటం చూశామని తెలిపారు. దీంతో తలిదండ్రులు వెంటనే కిందకి వెళ్లి చూసేసరికి బాలుడు సురక్షితంగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా బాలుడు కిందపడుతున్నప్పడు చెట్ల కొమ్మలు గిరుకొని చిన్నపాటి గాయాలు కాగా దగ్గర్లో ఉన్న దవాఖానాలో చేర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories