మరికాసేపట్లో కేబినెట్ తొలి భేటీ.. కీలక విషయాలపై చర్చ

మరికాసేపట్లో కేబినెట్ తొలి భేటీ.. కీలక విషయాలపై చర్చ
x
Highlights

రాష్ట్ర మంత్రివర్గ మొట్టమొదటి సమావేశం కాసేపట్లో జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ...

రాష్ట్ర మంత్రివర్గ మొట్టమొదటి సమావేశం కాసేపట్లో జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుని ఆమోదించనున్నారు. నవరత్నాలతో కూడిన వైసీపీ మేనిఫెస్టో అమలే లక్ష్యంగా సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పటికే అధికారులకు సర్క్యులేట్‌ చేశారు.

కేబినెట్‌ భేటీలో ఎనిమిది అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. మొదటి అంశంగా వృద్ధాప్య పింఛన్లు 2వేల 250కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారు. రెండో అంశంగా ఆశా వర్కర్ల వేతనాలను 10వేలకు పెంపు నిర్ణయానికీ అంగీకారం తెలుపుతారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, మునిసిపల్‌ శానిటరీ సిబ్బంది వేతనాలు పెంపు, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌, రైతుభరోసా పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ రద్దుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలనూ టేబుల్‌ ఐటెమ్స్‌గా చర్చించే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories