Top
logo

శేషాచలం అడవుల్లో భారీగా వ్యాపించిన మంటలు

శేషాచలం అడవుల్లో భారీగా వ్యాపించిన మంటలు
X
Highlights

తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలతో రెండు రోజులుగా 40 హెక్టార్ల...

తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలతో రెండు రోజులుగా 40 హెక్టార్ల అడవి దగ్ధమైంది. శ్రీవారి పాదాలు, ధర్మగిరి సమీప రిజర్వు ఫారెస్టులో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేయలేకపోతే టీటీడీ ఫారెస్ట్ పరిధిలోకి మంటలు వ్యాపించే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుంచి టీటీడీ అటవీ సిబ్బంది మంటల ఆర్పేందుకు యత్నిస్తున్నారు. రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలో మంటలు వ్యాపిస్తున్నాయి.

Next Story