Top
logo

జనసేనానికి ఊహించని పరిణామం..వైఎస్‌ జగన్‌ను గెలిపించాలని..

జనసేనానికి ఊహించని పరిణామం..వైఎస్‌ జగన్‌ను గెలిపించాలని..
Highlights

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తాను నిత్యం కత్తులు...

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తాను నిత్యం కత్తులు దూస్తున్న వైసీపీని గెలిపించమంటూ ఓ రైతు పవన్‌ను స్వయంగా కోరాడు. పవన్ సమక్షంలోనే భుజంపై చెయ్యి వేసి మరీ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో సహకరించాలంటూ కోరాడు.

మూడు రోజులు పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అదోని పత్తి మార్కెట్‌ యార్డులో రైతులతో పవన్‌ ముఖాముఖి నిర్వహిస్తున్న సమయంలో ఓ రైతు తన కష్టాలు చెబుతూ తన కష్టాలు పోవాలంటే జగన్ గెలవాలంటూ చెప్పాడు. ఇందుకు మీరే సహరించాలంటూ పవన్ కళ్యాణ్‌ను కోరాడు.

రైతు వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్స్ చేయని పవన్ అనంతరం మరో ఇద్దరు రైతులతో మాట్లాడారు. ఇదే సమయంలో కొందరు జనసేన కార్యకర్తలు స్టేజి పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేయడంతో అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కత్తులు దూసే వైసీపీనే గెలిపించాలంటూ ఓ రైతు ఏకంగా జనసేనానే కోరడాన్ని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మూడు రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఆళ్లగడ్డలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం కడప జిల్లాలో పర్యటించినున్నారు .

Next Story

లైవ్ టీవి


Share it