తీవ్ర పెను తుపానుగా ఫొని

తీవ్ర పెను తుపానుగా ఫొని
x
Highlights

ఫెను తుఫాన్‌గా మారిన ఫొని మరింత వేగాన్ని పుంజుకుంది. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల...

ఫెను తుఫాన్‌గా మారిన ఫొని మరింత వేగాన్ని పుంజుకుంది. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో అలాగే ఒడిశాలోని పూరికి దక్షిణ నైరుతి దిశగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయివుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని గోపాల్ పూర్ - చాంద్ బలి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం తుపాను కేంద్రం చుట్టూ గంటకు 215 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో కూడా ఇంతే వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందంటున్నారు.

ఫొని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే సూచనలు ఉన్నాయి. గురువారం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒడిశాలో 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories