ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు... ఒకే విద్యార్థికి రెండు హాల్‌టికెట్లు

ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు... ఒకే విద్యార్థికి రెండు హాల్‌టికెట్లు
x
Highlights

ఇంటర్మీడియట్‌ బోర్డు తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే విద్యార్థికి రెండు హాల్‌టికెట్లు జారీ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా...

ఇంటర్మీడియట్‌ బోర్డు తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే విద్యార్థికి రెండు హాల్‌టికెట్లు జారీ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన వినోద్‌ 2015-17 సంవత్సరంలో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాడు. కెమిస్ట్రీ ఫెయిల్‌ కావడంతో సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాడు. ఈ నెల 12న పరీక్ష రాయాల్సి ఉండటంతో హల్‌టికెట్‌ డౌన్‌చేసుకుని షాక్‌కు గురయ్యాడు. ఇంటర్‌ బోర్డు రెండు హాల్‌ టికెట్లు జారీ చేయడమేకాక నంబర్లు, పరీక్ష కేంద్రాలు వేర్వేరుగా కేటాయించడంతో అవాక్కయాడు. ఏ కేంద్రంలో పరీక్ష రాయాలో తెలియక వినోద్‌ అయోమయానికి గురవుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories