Top
logo

ఈసీ కీలక నిర్ణయం.. టీఆర్‌ఎస్‌కు ఊరట

ఈసీ కీలక నిర్ణయం.. టీఆర్‌ఎస్‌కు ఊరట
X
Highlights

ఇటివల తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి, ధర్మపురి నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తు వల్లే ...

ఇటివల తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి, ధర్మపురి నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తు వల్లే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కాగా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలి ఉన్న ట్రక్కు గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ట్రక్కు, ఇస్రీపెట్టె గుర్తులను ప్రీ సింబల్స్‌ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కేసీఆర్‌ ఫిర్యాదు మేరకు సీఈసీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రక్కు గుర్తును ఎవ్వరికీ కేటాయించమని ఈసీ స్పష్టం చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ నిర్ణయంతో టీఆర్ఎస్‌కు పెద్ద ఊరట కలిగించే అంశమనే చెప్పవచ్చు. ఇక ఈసీ నిర్ణయంతో గూలాబీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Next Story