నిజామాబాద్‌లో బ్యాలెట్ కాదు.. ఈవీఎంలతోనే పోలింగ్

నిజామాబాద్‌లో బ్యాలెట్ కాదు.. ఈవీఎంలతోనే పోలింగ్
x
Highlights

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల నిర్వాహణపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన...

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల నిర్వాహణపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషన్ కు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయాలని ఈసీఐఎల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

నిజామాబాద్ లోక్‌ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువమంది నిలవడంతో ఓటింగ్ ఎలా నిర్వహిస్తారనే మీమాంసకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధికంగా 185 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న సందిగ్దంపై ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. అంత మంది అభ్యర్థులకు ఈవీఎంలలో చోటు దక్కదనే వాదనకు ఫుల్‌స్టాప్ చెబుతూ నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వాహణకు ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది.

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను భేరీజు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. భారీ సైజ్ లో బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి వస్తుందని సమయం కూడా ఎక్కువ పడుతుందని భావించింది. బెల్ ఎం3 ఈవీఎంల ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులకు పోలింగ్‌ జరిపే అవకాశం ఉందని భావించింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు 26,820 బ్యాలెట్‌ యూనిట్లు, 2,240 కంట్రోల్‌ యూనిట్లు, 2600 వీవీ ప్యాట్‌ యంత్రాలు అందించాలని ఈసీఐఎల్‌కు సూచించింది. నిజామాబాద్ బరిలో ప్రస్తుతం 185 మంది అభ్యర్ధులు ఉన్నారు. వివిధ రాజకీయా పార్టీల నుంచి ఏడుగురు అభ్యర్ధులతో పాటు 178 మంది రైతుల పోటీ పడుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories