Top
logo

ఒంగోలును నేనే అభివృద్ధి చేశా: దామచర్ల జనార్ధన్

ఒంగోలును నేనే అభివృద్ధి చేశా: దామచర్ల జనార్ధన్
X
Highlights

తాను 2014లో గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పారు...

తాను 2014లో గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పారు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్. ఎప్పటికప్పుడు ఒంగోలు నగరానికి ఏం చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నానని, అందుకే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. అయితే, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా చేసిందేమీ లేదని విమర్శించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డికి బంధువుగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మన రాష్ట్రం నాశనం కోరుకునే కేసీఆర్‌తో వైసీపీ అధినేత జగన్ చేతులు కలిపారని మండిపడ్డారు. మళ్లీ తనను గెలిపిస్తే ఒంగోలు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు జనార్ధన్.

Next Story