బంగ్లాదేశ్‌లో ఫణి బీభత్సం... 14 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఫణి బీభత్సం... 14 మంది మృతి
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను భారత్ నుంచి బంగ్లాదేశ్ లో ప్రవేశించింది. ఇవాళ ఉదయం ఒడిశా వద్ద తీరం దాటిన ఫోని.. పశ్చిమ బెంగాల్ మీదుగా ఇవాళ బంగ్లాదేశ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను భారత్ నుంచి బంగ్లాదేశ్ లో ప్రవేశించింది. ఇవాళ ఉదయం ఒడిశా వద్ద తీరం దాటిన ఫోని.. పశ్చిమ బెంగాల్ మీదుగా ఇవాళ బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పటివరకు బంగ్లాదేశ్ లో 14 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఫోని బీభత్సం కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 330 ఎకరాలు పంట భూమి పూర్తిగా నాశనం అయింది. 53 వేల ఎకరాల పంట భూమి పాక్షికంగా దెబ్బతింది. 2243 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 11.172 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలిచింది. ఇప్పటి వరకు 3800 మెట్రిక్ టన్నుల ఆహార పదార్ధాలను సిద్ధంగా ఉంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories