రాహుల్‌పై హత్యాయత్నమా?

రాహుల్‌పై హత్యాయత్నమా?
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీనేతలు...

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీనేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమేథీ పర్యటనలో గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్ గాంధీ తలను స్నైపర్ గన్ తో టార్గెట్ చేశారని ఆరోపించారు. రాహుల్ తలపై ఏడు సార్లు గ్రీన్ లేజర్ పాయింట్ వేసినట్టు తెలిపారు. రాహుల్ భద్రతను కేంద్ర హోంశాఖ పట్టించు కోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్ భద్రతలో లోపాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. అమేథిలో రాహుల్ మాట్లాతున్న వీడియో క్లిప్పింగ్స్ ను సమర్పించారు. రాహుల్ తలపై పడిన లేజర్ కాంతి స్నైపర్ గన్ ది కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే కాంగ్రెస్‌ అనుమానాలను హోంమంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. రాహుల్‌ గాంధీ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. రాహుల్ తలపై వెలిగిన గ్రీన్ లైట్ స్నైపర్‌ రైఫిల్‌ నుంచి వెలువడింది కాదని..అది సెల్‌ఫోన్‌ నుంచి వచ్చిన లైటు అని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని హోంశాఖ వర్గాలు అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories