పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ దృష్టి

పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ దృష్టి
x
Highlights

గతం మరిచిపోండి. ఓటమి భారం వీడండి. కొత్త పోరుకు సిద్ధం కండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ కు హై కమాండ్ హితబోధ చేసింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఆశావాహుల పేర్లను పరిశీలించాలని కోరింది.

గతం మరిచిపోండి. ఓటమి భారం వీడండి. కొత్త పోరుకు సిద్ధం కండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ కు హై కమాండ్ హితబోధ చేసింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఆశావాహుల పేర్లను పరిశీలించాలని కోరింది. అలాగే కొత్త జిల్లాలకు అనుగుణంగా డీసీసీలను నియమించాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తెలంగాణ కాంగ్రెస్ మెల్లమెల్లగా తేరుకుంటోంది. ఇటీవల కోర్ కమిటీలతో ఎన్నికల ఓటమిపై సమీక్ష నిర్వహించిన టీ కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలే తమ కొంప ముంచాయని హై కమాండ్ కు రిపోర్టు ఇచ్చారు. గతం మరిచిపోయి రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఢిల్లీ పెద్దలు ఉపదేశించారు.

లోక్ సభ పోరుపై రేపటి నుంచి మూడు రోజుల పాటు గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ చార్జ్ లు, పీసీపీ నేతలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తారు. 17 పార్లమెంట్ స్థానాలపై సమీక్ష చేస్తారు. నాలులు, ఐదు తేదిల్లో ఆరు సీట్ల చొప్పున, ఏడో తేదిన ఐదు స్థానాల్లో పార్టీ పరిస్థితిపై తెలుసుకుంటారు. పీసీసీ నాయకులకు పార్టీ పెద్దలు శ్రీనివాసన్, సలీం అహ్మద్, బోసు రాజులు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తారు. పీసీసీ నేతలతో జిల్లాల నేతల అభిప్రాయం తెలుసుకుంటారు. హై కమాండ్ సూచన మేరకు ఈ నెల 25 లోపు లోక్ సభ ఆశావాహుల పేర్ల జాబితాను సిద్ధం చేస్తారు. అలాగే గ్రామపంచాయితీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాం పై చర్చిస్తారు.

మరోవైపు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 33 డీసీసీలు భర్తీకి టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. గతంలో పదిమంది డిసిసి ప్రెసిడెంట్లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం డీసీసీలను నియమించనున్నారు. ఓటమి నైరాశ్యం నుంచి బయటపడడానికి క్యాడర్ లో కొత్త ఉత్సహం కోసం పదవులు పందేరం చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసిసి పదవులు నిర్వహించడానికి నాయకులు ముందుకొస్తారో రారో అనే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories