ఉత్తమ్‌పై సర్వే సత్యనారాయణ ఆగ్రహం

ఉత్తమ్‌పై సర్వే సత్యనారాయణ ఆగ్రహం
x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఏకంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఏకంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. అర్హత లేని అసమర్ధులకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పదవులు కట్టబెట్టాడంటూ సర్వే ఆరోపించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌గా తొలగించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నేతను పార్టీ ఇంకా భరించాల్సిన అవసరం ఉందా ? అంటూ ప్రశ్నించారు .పార్టీ కోసం తాను సలహాలు ఇస్తే పార్టీలోని రౌడీ మూకలు తన పట్ల దురుసుగా ప్రవర్తించాయంటూ తీవ్ర స్ధాయిలో విమర్శించారు. పార్టీలోని అన్ని అంశాలపై గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తానన్న సర్వే తన ప్రెస్‌మీట్‌‌కు అనుమతి ఇస్తారో లేదో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లోని మహాత్ముడి విగ్రహం ముందు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ధర్నాకు దిగుతానంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్టీకి నష్టం చేసినవాళ్లే మళ్లీ రివ్యూలు చేస్తే ఎలా?అని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories