కడుపు నొప్పని హాస్పిటల్‌కి వెళితే.. కిడ్నీ గాయబ్

కడుపు నొప్పని హాస్పిటల్‌కి వెళితే.. కిడ్నీ గాయబ్
x
Highlights

మీ కిడ్నీ భద్రమేనా....? మీ కిడ్నీ దొంగల పాలైయిందా...? ఏపీలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు కలవరం పుట్టిస్తున్నాయి. విశాఖ కిడ్నీరాకెట్‌పై దర్యాప్తు...

మీ కిడ్నీ భద్రమేనా....? మీ కిడ్నీ దొంగల పాలైయిందా...? ఏపీలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు కలవరం పుట్టిస్తున్నాయి. విశాఖ కిడ్నీరాకెట్‌పై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మరో కిడ్నీ కాజేసిన వ్యవహారం తెరపైకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన మల్లాడి కాసులయ్య 1991లో నడుము నొప్పితో బాధ పడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. బాధితుడు మొదట అమలాపురంలోని విజయ స్కాన్ సెంటర్‌కు వెళ్లాడు. వారు కాకినాడ సుధా యూరాలజీ ఆసుపత్రికి పంపించారు. కాసులయ్యకు యూరాలజీ డాక్టర్లు సర్జరీ చేసి పంపించారు.

ఇటీవల బాధితునికి మరల నడుము నొప్పి రావడంతో అమలాపురంలోని రాఘవ స్కాన్ సెంటర్‌కు వెళ్లాడు. ఎడమ వైపు కిడ్నీలేదని దృవీకరించేంతవరకు బాధితుడికి కిడ్నీ లేదనే విషయం తెలియదు. దీంతో కాసులయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా వారు అమలాపురం పట్టణ పోలీసులకు కేసును బదిలీ చేశారు. నడుంనొప్పి బాధతో హస్పటల్‌కు వెళితే తనకు తెలియకుండా డాక్టర్స్ కిడ్నీ కాజేశారని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. కాసులయ్య కిడ్నీ రాకెట్‌లో సూత్రధారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు...? కిడ్నీ దొంగిలించిన హస్పటల్ యజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూద్దాం.



Show Full Article
Print Article
Next Story
More Stories