'సొంత ప్రయోజనాల కోసమే కూటమి'

సొంత ప్రయోజనాల కోసమే కూటమి
x
Highlights

రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయా పార్టీలు పదునుపెట్టుకుంటున్నాయి. అయితే ఇటివల జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నిస్తున్న విషయం తెలిసిందే.

రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయా పార్టీలు పదునుపెట్టుకుంటున్నాయి. అయితే ఇటివల జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ కూటమి నుంచి బయటకు వచ్చి ఎస్పీ, బీఎస్పీ కొత్తకూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు, 50-50 ఫార్ములతో ఒప్పందం కుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ కూటమిపై తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. కేవలం వారీ సొంత ప్రయోజనాలకు మాత్రమే ఎస్పీ,బీఎస్పీ కూటమి ఏర్పాటు చేసుకున్నారని యోగీ విమర్శించారు. ఎస్పీ,బీఎస్పీ పార్టీల బాగోతం అందరికి తెలుసునని ప్రజలు మాత్రం తప్పకుండా ఆలోచించే ఓట్లు వేస్తారని యోగీ పేర్కోన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపిట్ అవుతాయని అన్నారు. అయితే కూటమైతే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే కాగా దీనిపై అఖిలేశ్ యాదవ్, మాయవతి నేటికి అధికారంగా ప్రకటించలేదు. ఇదే నేపథ్యంలో వారిద్దరు శనివారం(రేపు) ఉమ్మడి మీడియా సమావేశంలో కూటమి గురించి స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories