Top
logo

కేసీఆర్‌ x భట్టి

కేసీఆర్‌ x భట్టి
X
Highlights

సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. చివరిరోజు...

సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. చివరిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగాయి. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్రంపై ఉన్న అప్పులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఇద్దరు నేతల మధ్య చర్చ హాట్‌గా సాగింది. అసలు కాంగ్రెస్‌ సభ్యులకు బడ్జెట్‌పై అవగాహన లేదని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. చివరిరోజు బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌, మల్లు భట్టి విక్రమార్క మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది. ఇద్దరు నేతల మధ్య బడ్జెట్‌ లెక్కల విషయంలో మాటల తూటాలు పేలాయి. సభను తప్పుదోవ పట్టేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story