స్మగ్లింగ్‌కు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయండి:కేసీఆర్

స్మగ్లింగ్‌కు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయండి:కేసీఆర్
x
Highlights

పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.

పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్లగ్లింగ్ కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పోలీసుల సహకారంతో కలప స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని, తరచూ స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై పి.డి. యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. కలప స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా చర్యలు తీసుకోవాలని సిఎం కేసీఆర్ అదేశించారు. రాజకీయ నాయకులు ఎవరైనా స్మగ్లింగ్ కు పాల్పడినా వదిలిపెట్టవద్దని టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఈ పనిచేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోండని అధికారులకు స్పష్టమై ఆదేశాలు జారీ చేశారు.గతంలో నక్సలైట్ల కారణంగా అడవుల్లోకి వెళ్లడం సాధ్యం కావట్లేదని సాకులు చెప్పేవారని ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ లేదని కేసీఆర్ గుర్తుచేశారు. అడవులను కాపాడడమే లక్ష్యంగా పనిచేయండని అధికారులకు స్పష్టం చేశారు. పోలీస్, అటవీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి సిఎం కేసీఆర్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories