logo
తాజా వార్తలు

మరోసారి తెరపైకి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు

మరోసారి తెరపైకి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు
X
Highlights

తెలంగాణలో మరోసారి పార్లమెంటరీ కార్యదర్శి పదవుల అంశం తెరపైకి రాబోతోంది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని గతంతో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అవసరమైతే చట్టం తీసుకువచ్చైనా అనుకున్నది సాధించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.పార్లమెంటరీ సెక్రటరీల నియామక చట్టం ఎలా రూపొందించాలి ఎంత మందిని నియమించాలి? ఎవరికి అవకాశమివ్వాలనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు.

తెలంగాణలో మరోసారి పార్లమెంటరీ కార్యదర్శి పదవుల అంశం తెరపైకి రాబోతోంది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని గతంతో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అవసరమైతే చట్టం తీసుకువచ్చైనా అనుకున్నది సాధించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.పార్లమెంటరీ సెక్రటరీల నియామక చట్టం ఎలా రూపొందించాలి ఎంత మందిని నియమించాలి? ఎవరికి అవకాశమివ్వాలనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు. గతం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న కేసీఆర్‌కు పదవుల పంపకం చిక్కొచ్చి పడింది.

నిబంధనలు ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటం మరి కొందరికి మాత్రమే నామినేటెడ్ పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉండడంతో ముఖ్యులు, సీనియర్లను సంతృప్తి పరచడం కష్టంగా మారింది. మంత్రి పదవులు దక్కక, వివిధ సంస్థల ఛైర్మన్ల వంటి పదవులు రాక నిరాశ చెందే వారికోసం పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను భర్తీకి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. గతంలోలా కాకుండా ఈసారి చట్టబద్దంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నిజానికి పార్లమెంట్ సెక్రటరీలు మంత్రులకు సహాయకులుగా ఉంటారు. వారికి క్యాబినేట్ హోదా ఉంటుంది. మంత్రుల‌కు ఉండే అన్ని వ‌స‌త‌ులు ఇస్తారు. ఏ శాఖ పార్లమెంట్ సెక్రటరీ తమ మంత్రులకు సూచలు, సలహలను ఇస్తుంటారు. సిఫారసులు చేస్తుంటారు, అయితే వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. మంత్రివర్గ భేటికి హాజరు కాలేరు. ఈ నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం ద్వారా ఎమ్మెల్యేల్లో అసమ్మతి రాకుండా చూడాలని కేసీఆర్ యోచిస్తున్నారు.

గత టర్మ్‌లో కేసీఆర్ అరుగురు పార్ల‌మెంట‌రీ సెక్ర‌టరీలను జీవో ద్వారా నియామించారు. ఒడితెల సతీష్ కుమార్ , గాదరి కిషోర్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, కోవా లక్ష్మి, జలగం వెంకటరావు, వినయ్ భాస్కర్ కు పార్లమెంట్ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. ఈ నియ‌మాకాలు చెల్ల‌వంటూ అప్పట్లో ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, రేవంత్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించారు. పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల నియ‌మ‌క ప‌క్రియ‌లో లోపాల‌ున్నాయంటూ హైకోర్టు ఆ పోస్టుల ర‌ద్దుకు అదేశించింది. పార్లమెంటరీ కార్యదర్శులకు క్యాబినెట్ హోదా ఇచ్చే వెసులుబాటు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఈసారి అంలాంటి పరిస్థితి తలెత్తకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రత్యేక చట్టం ద్వారా పార్లమెంటరీ సెక్రటెరీ నియమకం చేపట్టడానికి న్యాయ శాఖ, రాజ్యంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉన్న పార్లమెంటరీ కార్యదర్శుల విధానాన్ని పరిశీలిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చి పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలు ఒకేసారి జరపాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

Next Story