Top
logo

జగన్‌ మాయా రాజకీయం ఏపీలో చెల్లదు: చంద్రబాబు

జగన్‌ మాయా రాజకీయం ఏపీలో చెల్లదు: చంద్రబాబు
X
Highlights

డేటా చోరీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్‌ మాయా రాజకీయం...

డేటా చోరీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్‌ మాయా రాజకీయం ఏపీలో చెల్లదన్న బాబు. హైదరాబాద్‌లో తమపై కేసులు పెట్టించి, టీడీపీ డేటాను దొంగిలించారని ఆరోపించారు. వైసీపీ నుంచి ఫోన్లు వస్తే తమ నెంబర్ ఎవరిచ్చారంటూ ఎదురు ప్రశ్నించాలని కేడర్‌‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో అన్న పార్టీలకు యాప్‌లు ఉన్నాయని, కానీ టీడీపీ యాప్‌పై మాత్రమే దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. టీడీపీపై మోడీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ ఉన్నాయన్నారు. ఫామ్‌-7 దరఖాస్తులు తమ పనేనని జగనే చెప్పాడని, తొలి దశలో 13లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ శ్రేణులు సకాలంలో స్పందించి, ఈ కుట్రలను అడ్డుకోగలిగామని చెప్పారు.

Next Story